యూఏఈ లో వచ్చే వారం రోజుల్లో వర్షాలు
- April 11, 2024
యూఏఈ: యూఏఈలోని నివాసితులు ప్రస్తుతం సంవత్సరంలో సుదీర్ఘమైన ఈద్ సెలవులని ఆస్వాదిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై మరియు చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలతో 9 రోజుల సుదీర్ఘ ఈద్ అల్ ఫితర్ ఉత్సవాల్లో మునిగిపోయారు. ఏప్రిల్ 14న సెలవు ముగుస్తున్నందున.. తుఫాను పరిస్థితులు అబుదాబి మరియు దుబాయ్‌లను కూడా ప్రభావితం చేయనున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 31°C వరకు పెరుగుతాయని, సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది., వర్షం పడే అవకాశం రాత్రి సమయంలో 80%కి పెరుగుతుంది.ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని
నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) నుండి వాతావరణ నిపుణుడు డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. నివాసితులు మరియు వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. భారీ వర్షపాతంతో కొన్ని ప్రాంతాలలో ఆకస్మిక వరదలు సంభవించవచ్చు. డ్రైవర్లు నీటమునిగిన వాడీలు మరియు నీట మునిగిన ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ట్రాఫిక్ నియమాలను పాటించాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







