పితృత్వం, IVF, గర్భస్రావం సెలవు: కంపెనీలలో తల్లిదండ్రులకు కోసం పాలసీలు

- April 11, 2024 , by Maagulf
పితృత్వం, IVF, గర్భస్రావం సెలవు: కంపెనీలలో తల్లిదండ్రులకు కోసం పాలసీలు

యూఏఈ: యూఏఈలోని కంపెనీలు యువ తల్లిదండ్రుల అవసరాలను ఎక్కువగా పునరాలోచించి, తదనుగుణంగా వారి విధానాలను రూపొందిస్తున్నాయి. నెల రోజుల పితృత్వ సెలవును అందించడం నుండి IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చికిత్సలు, ప్రసవాల కోసం సెలవులు మంజూరు చేస్తున్నాయని ఫైన్ హైజీనిక్ హోల్డింగ్ యొక్క CEO జేమ్స్ మైఖేల్ లాఫెర్టీ తెలిపారు. పాలసీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఒకరిద్దరు ఉద్యోగులు సెలవును వినియోగించుకున్నారని చెప్పారు. అంతేకాకుండా, కంపెనీలో నాలుగు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు,  నెలకు ఒక రోజు రుతుస్రావం సెలవు, అలాగే IVF చికిత్స కోసం అవసరమైన వారికి కూడా సెలవు ల పాలసీలు ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులకు అందించే వార్షిక సెలవులకు ఇది అదనం అని పేర్కొన్నారు. VFS గ్లోబల్ అనేది ఈ సంవత్సరం ప్రారంభంలో GCCలోని తన ఉద్యోగులకు పెటర్నిటీ సెలవులను అందించడం ప్రారంభించిన మరొక సంస్థ. సంస్థ 2024 నుండి నాలుగు నెలల మెటర్నిటీ సెలవులని అందిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com