రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం..డాక్టరేట్ ప్రకటించిన ప్రముఖ యూనివర్సిటీ..
- April 11, 2024
చెన్నై: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. RRR తో వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా, ఆ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రకాలుగా ప్రఖ్యాత కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు సంపాదించుకున్నారు చరణ్. ఇప్పుడు రామ్ చరణ్ కి ఏకంగా డాక్టరేట్ ప్రకటించింది ఓ ప్రముఖ యూనివర్సిటీ. తమిళనాడు చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13న ఈ యూనివర్సిటీలో జరగనున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. చరణ్ తో పాటు పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా రాబోతున్నట్టు సమాచారం.
ఆ రోజున ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చరణ్ ఈ డాక్టరేట్ అందుకుంటారని సమాచారం. కళారంగానికి చరణ్ చేసిన సేవలకు గాను ఈ డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నట్టు యూనివర్సిటీ వెల్లడించింది. దీంతో చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ కి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?