మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- April 12, 2024
న్యూ ఢిల్లీ: భారత దేశంలో మూడో దశలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మే 7న పలు రాష్ట్రాల్లోని స్థానాల్లో జరిగే పోలింగ్‌కు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈసీ. మూడో దశలో మొత్తం 94 లోక్‌సభ నియోజక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రనగర్ హావేలి, డామన్ డయ్యు, గుజరాత్, గోవా, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పలు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, లోక్ సభతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైన విషయం తెలిసిందే.
ఎన్నికలు ఏప్రిల్ 17 నుంచి మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. కౌంటింగ్ జూన్ 4న ఉంటుంది. ఇంతకు ముందే తొలి రెండు దశల ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. నాలుగో దశలో భాగంగా ఏపీలో మే 13న ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఎన్నికల వేళ దేశంలోని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే తమ అభ్యర్థుల విషయంపై తుది నిర్ణయాలు తీసుకున్నాయి. దేశంలో 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేస్తుంది. 1.5 కోట్ల మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది పనిచేస్తారు. 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు వాడనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?