తెల్ల జుట్టు సమస్యను సింపుల్‌గా ఇలా నివారించుకోండి.!
- April 12, 2024
వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు సమస్య వేధిస్తోంది ప్రస్తుత కాలంలో. మార్కెట్‌లో లభించే కెమికల్ హెయిర్ డై ప్రొడెక్టులు జుట్టుకు హాని తలపెడుతున్నాయ్.
కానీ, ఉరుకుల పరుగుల జీవితంలో మెయింటెనెన్స్ కొరవడుతోంది. తాత్కాలికమే అయినా, ఇనిస్టెంట్‌గా పని జరిగిపోవాలి. దాంతో, మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డైస్ వాడక తప్పడం లేదు.
కానీ, కాస్త టైమ్ చూసుకుని కేర్ తీసుకుంటే కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారానే తెల్ల జుట్టు సమస్యను అధిగమించొ్చు.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కేవలం కొబ్బరి నూనెతోనే తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి, అందులో కొంచెం గోరింటాకు పొడిని వేసి వుడికించి ఆ పేస్ట్ తలకు పట్టించాలి.
కుదుళ్ల నుంచి సరిగ్గా జుట్టు మొత్తం పట్టేలా ఈ పేస్ట్ అప్లై చేసుకోవాలి. గంట తర్వాత తేలిక పాటి షాంపూతో కానీ, లేదంటే కుంకుడు కాయ్, షీకాకాయ్ వంటి వాటితో తల స్నానం చేస్తే సరిపోతుంది.
వారంలో ఒక్కసారి ఇలా చేస్తే .. శాశ్వతంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే, వేడి చేసిన కొబ్బరి నూనెలో కాస్త నిమ్మరసం కలిపి తలకు పట్టించినా తెల్ల జుట్టు సమస్య తీరుతుంది.
అయితే, కంటిన్యూస్‌గా వారానికి ఓ సారి ఈ ప్రొసెస్‌ని ఫాలో చేయాలి. అప్పుడే ఈ సమస్యను అధిగమించొచ్చని నిఫుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్‌లకు బలవుతున్న ఇన్వెస్టర్లు..!!
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- స్పెషల్ ఆపరేషన్.. ఖైతాన్‌లో 20 మంది ప్రవాసులు అరెస్టు..!!
- యూఏఈ ఉద్దేశపూర్వకంగా 3 నౌకలను ఎందుకు ముంచివేసిందంటే..!!
- సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు
- మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్
- హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ వార్..ముడి చమురు ధరలకు రెక్కలు!