తారకరాముడు బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు.!
- April 12, 2024
ఎన్టీయార్ ‘దేవర’ సినిమా షూటింగ్‌కి చిన్న బ్రేక్ ఇచ్చి బాలీవుడ్‌లో అడుగు పెట్టాడు. అక్కడ ఆల్రెడీ కమిట్ అయిన ‘వార్ 2’ ప్రాజెక్ట్ గురించి ఎన్టీయార్ డేట్స్ కేటాయించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హృతిక్ రోషన్ లీడ్ రోల్ పోషిస్తుండగా, ఎన్టీయార్ విలన్ రోల్ పోషిస్తున్నాడు. ఇద్దరి మధ్యా వచ్చే సీన్లు చాలా చాలా పవర్ ఫుల్‌గా వుండబోతున్నాయని గతంలోనే పలు హింట్లు ఇచ్చారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు బాలీవుడ్‌లో అడుగు పెట్టాడట ఎన్టీయార్. కాగా, ఈ సినిమాతో పాటూ, మరికొన్ని బాలీవుడ్ సినిమాల కోసం ఎన్టీయార్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయట ఈ నేపథ్యంలోనే.
షూటింగ్ గ్యాప్‌లోనే పలు ప్రాజెక్టులు చర్చకు వస్తున్నాయట. అంటే, ఎన్టీయార్ భవిష్యత్తులో మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 10న ఎన్టీయార్ నటించిన ‘దేవర’ రిలీజ్ కానుంది. ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్‌లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'