పిల్ల‌లలో డిజిటల్ వ్యసనం.. బహ్రెయిన్ తల్లి ప‌రిష్కారం

- April 13, 2024 , by Maagulf
పిల్ల‌లలో డిజిటల్ వ్యసనం.. బహ్రెయిన్ తల్లి ప‌రిష్కారం

బహ్రెయిన్: చిన్న పిల్లల భాషా నైపుణ్యాలపై స్మార్ట్ గాడ్జెస్  స్క్రీన్ సమయం  ప్రతికూల ప్రభావం గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి.  ఇద్దరు పిల్లల తల్లి అయిన హనన్ మర్హూన్ ఎలక్ట్రానిక్ పరికరాలకు వ్యసనాన్ని ఎదుర్కోవడానికి ఒక పరిష్కారాన్ని అందించారు. పుస్తకాలపై ప్రేమను ప్రోత్సహించడం మరియు పిల్లలలో స్క్రీన్ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న బుక్ క్లబ్ ను ప్రారంభించారు.  ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ అడిలైడ్ నిర్వహించిన తాజా అధ్యయనంలో 3- 10 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు, సగటున రోజుకు 172 నిమిషాలు స్క్రీన్‌ల ముందు గడిపే వారు దాదాపు 1,000 పదాలను నేర్చుకోలేకపోతున్నారని వెల్లడైంది. ఈ నేప‌థ్యంలో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించే మరియు భాషా అభివృద్ధిని ప్రోత్సహించే ప్రత్యామ్నాయాలను రూపొందించేందుకు మిసెస్ మర్హూన్ ముందుకువ‌చ్చారు. చాప్టర్స్‌బైహానన్ వ్యవస్థాపకురాలు అయిన ఆమె నేటి డిజిటల్ యుగంలో అధిక స్క్రీన్ సమయానికి బుక్ క్లబ్ విలువైన విరుగుడుగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. నేటి డిజిటల్ యుగంలో, స్మార్ట్‌ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లు ఆధిపత్యం ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌ని, పిల్లలు పుస్తకాలపై ప్రేమను ప్రోత్సహించడం ద్వారా అధిక స్క్రీన్ సమయాన్ని తగ్గించేందుకు దోహ‌దం చేస్తుంద‌న్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com