ప్రబాస్ శివుడు కాదట.! శివుడి వాహనమట.!
- April 15, 2024‘భక్త కన్నప్ప’ సినిమాలో ప్రబాస్ శివుడి పాత్ర పోషిస్తున్నాడట.. అంటూ ప్రచారం జరిగింది. కానీ కాదట. శివుడి వాహనం నంది పాత్రలో కనిపించబోతున్నాడట ప్రబాస్. ఇదీ తాజా ప్రచారం.
మంచు ఫ్యామిలీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన ‘భక్త కన్నప్ప’లో కాస్టింగ్ దిమ్మ తిరిగిపోయేలా రోజు రోజుకీ పెరిగిపోతోంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్, శాండిల్ వుడ్.. ఇలా అన్ని భాషల నుంచీ పలువురు ప్రముఖ నటీ నటులు నటిస్తున్న ఈ చిత్రంలో ప్రబాస్ శివుడి పాత్ర పోషిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది.
కానీ, ఆ పాత్రను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌కి ఫిక్స్ చేశారట. నంది పాత్రకూ ఈ సినిమాలో అత్యంత కీలక స్థానం వుండడంతో.. ఆ పాత్రలో పవర్ ఫుల్ కటౌట్ వున్న ప్రబాస్‌ని ఫిక్స్ చేశారట.
ప్రస్తుతం న్యూజిలాండ్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది ‘భక్త కన్నప్ప’. త్వరలోనే కొత్త షెడ్యూల్ కోసం టీమ్ సంసిద్ధమవుతోందట. అయితే, ఈ సినిమాపై రోజుకో రకం రూమర్ పుట్టుకొస్తోంది. అసలు నిజాలేంటో.. త్వరలోనే ఓ క్లారిటీకి రానుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్