సందీప్ రెడ్డి వంగా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా.?
- April 15, 2024
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఒక్క సినిమాకే బాలీవుడ్‌లో అడుగు పెట్టేశాడు. అదే సినిమాని అక్కడ కూడా రీమేక్ చేసి అక్కడా సంచలనాలు సృస్టించాడు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ల లిస్టులో సందీప్ రెడ్డి వంగా పేరు కూడా చేరిపోయింది. లేటెస్ట్ మూవీ ‘యానిమల్’ డైరెక్టర్‌గా ఆయన క్రేజ్‌ని మరింత పెంచేసింది.
ఇక, ఇప్పుడు ఆయన తెరకెక్కించబోయే చిత్రం ‘స్పిరిట్’. యూనివర్సల్ హీరో ప్రబాస్‌తో తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా ఇప్పటి నుంచే క్రేజీ టాక్‌లో నిలుస్తోంది. అంతేకాదు, సినిమాని పట్టాలెక్కించకుండానే ప్రమోషన్లు కూడా మొదలెట్టేశాడు సందీప్ రెడ్డి వంగా.
ఈ సినిమా గురించి అంత కాదు, ఇంత కాదు.. అంటూ టాక్ స్ప్రెడ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వరుస పెట్టి ఇంటర్వ్యూలిస్తున్నాడు కూడా. అలాగే, సోషల్ మీడియాలోనూ నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నాడు.
పలు ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాడు నెటిజన్లతో ఈ సందర్భంగా. తాజాగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటన్న ప్రశ్న తలెత్తింది. మైఖేల్ జాక్సన్ బయోపిక్‌ని తెరకెక్కించాలన్నది తన డ్రీమ్.. అనీ, అందుకు తగ్గ స్టోరీ, హీరో కోసం వెయిటింగ్.. అనీ అన్నీ సెట్ అయితే ఖచ్చితంగా ఆ బయోపిక్ తెరకెక్కిస్తా.. అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?