అయ్యో పాపం.! బేబమ్మా.! నిన్నెలా మర్చిపోయారమ్మా.!
- April 16, 2024
‘ఉప్పెన’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, అతి త్వరలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగి అమాంతం కిందికి పడిపోయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి.
వరుసగా ఫ్లాపులు వెంటాడడంతో కృతి శెట్టిని అందరూ పక్కన పెట్టేశారు. దాంతో, ప్రస్తుతం కృతి శెట్టిని అందరూ మర్చిపోయారు.
అందానికి అందం, అభినయానికి అభినయం వున్న ఈ ముద్దుగుమ్మపై ఐరెన్ లెగ్ ముద్ర వేసి పక్కన పెట్టేయడం నిజంగా బాధాకరమే.
అయితేనేం, కృతి శెట్టి మళ్లీ వస్తోంది. ‘మనమే’ సినిమా కృతి శెట్టికి సెకండ్ ఇన్నింగ్స్ అనొచ్చేమో. అదేనండీ.! శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకి ప్రమోషన్లు చాలా ఇంట్రెస్టింగ్‌గా చేస్తున్నారు.
తండ్రీ కొడుకు సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ ఇంట్రెస్టింగ్‌గా చేశారు. ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే వున్నాయ్. కానీ, హీరో వైపు నుంచే ఆ అప్డేట్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు.
అదే మెన్షన్ చేస్తూ.. డైరెక్టర్ గారూ మీరు నన్ను మర్చిపోయారు.. అంటూ క్యూట్ కృతి శెట్టి.. అలాగే ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న బుడ్డోడితో కలిసి ఓ ప్రత్యేకమైన వీడియో డిజైన్ చేశారు. ఈ వీడియోని ప్రజెంట్ చేసిన తీరు భలే వుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండింగ్ అవుతోంది. ఆ రకంగా మళ్లీ కృతి శెట్టిని అందరూ గుర్తు చేసుకుంటున్నారు.
Where is #ManameyTeaser ?
— KrithiShetty (@IamKrithiShetty) April 16, 2024
Director Gaaru @sriramadittya !!!
Inka Wait cheyadam maa valla kaadhu 🙁
-Krithi & Vikram pic.twitter.com/cSrzSmFoMK
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025