ప్రశాంత్ వర్మ బాలీవుడ్ ప్రాజెక్ట్.?
- April 16, 2024
‘హనుమాన్’ సినిమా దెబ్బకి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి ఏకంగా బాలీవుడ్ హీరోలు కూడా చేరిపోయారు. ఏమో.! త్వరలో సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి స్టార్స్ కూడా చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అసలు మ్యాటర్ ఏంటంటే, అసలే బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్లంటే పడి చస్తున్నారు. ఇప్పటికే షారూఖ్ ఖాన్; సల్మాన్ ఖాన్ వంటి హీరోలు ఆల్రెడీ సౌత్ డైరెక్టర్లతో కలిసి వర్క్ చేసేశారు. మరిన్ని ప్రాజెక్టులు కూడా లైన్‌లో పెట్టుకున్నారు.
ఇక ఇప్పుడు తెలుగు డైరెక్టర్ ‘ప్రశాంత్ వర్మకీ ఆ ఛాన్స్ దక్కేలా వుంది. ఆల్రెడీ బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణ్‌వీర్ సింగ్, ప్రశాంత్ శర్మతో ఓ సినిమాకి కమిట్ అయ్యాడనీ తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యేలా వుందట.
మరి, ప్రశాంత్ వర్మ ప్రామిస్ చేసినట్లుగా 10 మంది సూపర్ హీరోల కథలను తెరకెక్కిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే హనుమాన్, జై హనుమాన్‌తో ఆల్రెడీ రెండు సినిమాలు పూర్తయిపోతాయ్.
ఇక, బాలీవుడ్ నుంచి రణ్‌వీర్ సింగ్‌తో ఓ యాక్షన్ సూపర్ హీరో సినిమాకి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నాడట. ఓ బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి ఈ బిగ్గెస్ట్ ఆఫర్ ప్రశాంత్ వర్మ వద్దకి వచ్చిందట. ఆ వివరాలేంటో త్వరలోనే వెల్లడి కానుంది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!