నిమ్మకాయతో మౌత్ వాష్.! ఎలాగో తెలుసా.?
- April 16, 2024
నిమ్మకాయ అనేక రకాల వ్యాధులకు పరిష్కారంగా చెప్పొచ్చు. నిమ్మకాయలో సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
అలాగే, అధిక బరువు సమస్యను తీర్చుకునే వారికీ నిమ్మకాయ చిట్కాలు చాలానే యూజ్ అవుతుంటాయ్. అయితే, నోటి దుర్వాసనకు కూడా నిమ్మకాయతో చిట్కా వుందన్న సంగతి ఎంత మందికి తెలుసు చెప్పండి.
ప్రతీరోజూ ఉదయాన్నే పరగడుపున నిమ్మకాయ రసం తాగితే చాలా బావుంటుంది. పొట్ట శుద్ధి అవుతుంది. అలాగే, అధిక బరువు సమస్య కూడా తీరుతుంది.
అంతేనా.! నిమ్మకాయ రసంతో నోటిని గాగుల్ చేస్తే రోజంతా నోటి దుర్వాసన రాకుండా వుంటుందన్న సంగతి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
నోటి దుర్వాసన రాకుండా వుండేందుకు మార్కెట్లో లభించే పలు రకాల మౌత్ ఫ్రెష్‌నర్లు వాడేస్తుంటాం. కానీ, అవి తాత్కాలికంగా మాత్రమే పని చేస్తుంటాయ్.
చూయింగ్ గమ్ వంటివి కూడా వాడుతుంటారు కొందరు. వాటన్నింటి కన్నా.. నిమ్మకాయ రసంతో గాగుల్ చేయడం వల్ల నోటిలో హానికరమైన క్రిములు చనిపోతాయ్. తద్వారా నోటి దుర్వాసన సమస్య వుండదు.
ప్రతీరోజూ బ్రష్ చేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసానికి కాస్త నీటిని చేర్చి పుక్కిలిస్తే నోటి దుర్వాసన సమస్యకు మంచి పరిష్కారం వుంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!