జులైలో విడుదల కానున్న 'అమ్మకు ప్రేమతో'
- June 06, 2016
పి. ఉదయ భాస్కర్ దర్శకత్వంలో కృష్ణుడు, సన, రామ సత్యనారాయణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అమ్మకు ప్రేమతో'. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు ఉదయ భాస్కర్ మాట్లాడారు. 'తల్లిని మించిన దైవం లేదు'అని చిత్రీకరిస్తున్న చిత్రమిది. 'అమ్మకు ప్రేమతో' హృదయాలను హత్తుకునేలా ఉంటుంది' అన్నారు.
'ఉదయ భాస్కర్‌కి నాకు 15 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆయన కథ చెప్పగానే నటించేందుకు ఒప్పుకున్నాను. సమాజానికి అవసరమైన సినిమాలో నటించానన్న సంతృప్తి ఉంది. జూలైలో సినిమాని విడుదల చేస్తాం' అని నటుడు కృష్ణుడు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









