రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- April 19, 2024
యూఏఈ: ఎమిరేట్స్ చాలా ప్రాంతాల్లో వర్షాలు ఆగిపోయాయి. అయితే 75 ఏళ్లలో యూఏఈ చూసిన అత్యంత దారుణమైన వర్షాల కారణంగా చాలా మంది నివాసితులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు తమ విమాన సర్వీసులపై అస్పష్టంగా ఉన్నారు. ప్రయాణికులు బస్సులు మరియు మెట్రో కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను పరిశీలిస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు రిమోట్‌లో పని చేస్తుండగా.. పిల్లల కోసం ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు.
-షార్జా నుండి దుబాయ్ వరకు షేక్ రషీద్ రోడ్ నుంచి వరద నీటిని తొలగించారు. ట్రాఫిక్ కోసం క్లియరెన్స్ ఇచ్చారు.
-అల్ నహ్దా దుబాయ్ నుండి షార్జాకి వెళ్లే (ఎగ్జిట్ 69) రహదారి క్లియర్ అయింది.
- అల్ ఇత్తిహాద్ రోడ్, షార్జా నుండి దుబాయ్, క్లియరింగ్ కోసం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. వరద నీరు తగ్గుముఖం పడుతోంది.
-అల్ నుద్, అల్ ఖాసిమియా రహదారులలో వరద నీరు నిలిచిఉంది. ట్రాఫిక్ ను అనుమతించడం లేదు.
-షార్జాలోని సహారా సెంటర్ వైపు వెళ్లే అల్ నహ్దా రోడ్ క్లియర్ అయింది.
- జమాల్ అబ్దుల్ నాసర్ సెయింట్, సిటీ సెంటర్ షార్జా మీదుగా వెళ్లే అల్ మజాజ్ 2 రహదారి వరద నీటిలనే ఉంది.
- షార్జాలోని అల్ సోర్, అల్ ఖాసిమియాలను వరదలు ముంచెత్తినప్పటికీ, ప్రయాణానికి వీలుగా ఉండటంతో వాహనాలను అనుమతిస్తున్నారు.
- సౌదీ మస్జిద్ సిగ్నల్ నుండి అల్ జుబైల్ బస్ స్టేషన్ వరకు రహదారి వరద నీటితో నిందిపోయింది.
-దుబాయ్‌లోని లులూ హైపర్‌మార్కెట్‌కు సమీపంలో ఉన్న అల్ బార్షా 1లోని ఒక వీధి జలమయమైంది. పనులు కొనసాగుతున్నాయి
- షార్జాలోని కింగ్ ఫైసల్ సెయింట్ వైపు ఉన్న అల్ నాద్ పార్క్ ప్రాంతం వరద నీటితో నిండిపోయింది.
-మదినాల్ అల్ మక్తూమ్ ప్రాంతం మరియు దుబాయ్ సౌత్ నుండి ఎమిరేట్స్ రోడ్ (E611) వైపు వెళ్లే రోడ్లపై వరద నీరు ఉండటంతో దానిని మూసివేశారు.
తాజా వార్తలు
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!







