యాప్ ద్వారా వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్
- June 06, 2016రాయల్ ఒమన్ పోలీసులు, ఆన్‌లైన్ రెన్యువల్ కోసం సరికొత్త యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఈ యాప్ ద్వారా సులభతరంగా జరగనుంది. రాయల్ ఒమన్ పోలీస్ కార్యాలయాన్ని రెన్యువల్ కోసం వాహనదారులు ఇకపై సంప్రదించాల్సిన అవసరం లేదు. గడువుకు ముందు 30 రోజులపాటు ఈ రెన్యువల్ అవకాశం కల్పిస్తారు. తనిఖీ చేయాల్సిన వాహనాలకు ఈ విధానం ద్వారా మాత్రం రెన్యువల్ కుదరదు. యాప్‌ని ఓపెన్ చేసి, అందులో ట్రాఫిక్ సర్వీసెస్ ఆప్షన్‌ని ఎంపిక చేసుకుని, ఆ తర్వత రెన్యువల్ ప్రాసెస్‌ని పూర్తి చేయాల్సి ఉంటుంది. తమ ఐడీ నెంబర్‌తోపాటు వాహనం నెంబర్ తాలూకు కోడ్ నంబర్స్‌ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. జరీమానాలు ఏమైనా ఉంటే, అవి కూడా ఇక్కడే ప్రత్యక్షమవుతాయి. జరీమానాలు చెల్లించి, రెన్యువల్ కోసం ముందుకు వెళ్ళాలి. తమ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేశాక, పేమెంట్ గేట్‌వే లోకి వెళ్ళవలసి ఉటుంది. రెన్యువల్ పూర్తయ్యాక ఆ సమాచారం, ఆ మొబైల్‌కి చేరుతుంది.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్‌గాన్ పిల్స్ సీజ్..!!