* ఎప్పటిలాగే *

- June 06, 2016 , by Maagulf


కళ్ళు తెరవగానే 
ఊపిరి తిత్తుల నిండా  స్వచ్ఛమైన గాలిని నింపుకుంటావు 
మొన్నటి ప్రేమను 
నిన్నటి బాధను 
భుజాన వేసుకొని గూడు వదులుతావు
అడుగులు రెక్కలయినందుకు 
అలసిపోయేదాకా ఎగురుతావు 
దుఃఖం నుండి మేల్కోని వెలుతురును 
సుఖంలో నిదురించని రాతిరిని 
ఓదార్చుతూ భూమి చుట్టూ తిరుగుతావు 
గువ్వలతో పాటే గూడు చేరుకున్నాక 
అక్షరాలలో ఒదిగిపొతావు 
కడుపు నిండదు 
నిదుర పట్టదు
నీ ఆరాటమంతా
ఒక్క ముగింపు  వాక్యం కోసమే 

--పారువెల్ల 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com