140 గంటల్లో ఐదు దేశాలు.. 45 కార్యక్రమాల్లో పాల్గొన్నా మోదీ
- June 06, 2016
భారత ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తాను దృఢమైన వ్యక్తి అని నిరూపించుకున్నారు. భారత దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం తనదైన ముద్రను వేసుకున్న ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 140గంటల్లో ఆయన ఐదు దేశాలు చుట్టేశారు. దాదాపు 33 వేల కిలో మీటర్లు ప్రయాణించారు.ప్రస్తుతం అమెరికాలో ఉన్న మోదీ కేవలం అలుపులేకుండా 140 గంటల్లో ఐదు దేశాలు చుట్టేయడం చెప్పుకోదగిన విషయమే. అంతేకాకుండా, ఈ ఐదు దేశాల్లో ఆయన దాదాపు 45 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 44 గంటలపాటు విమానంలో ప్రయాణించారు. మోదీ తిరిగి ఢిల్లీలో ఈ నెల పదిన ఉదయం 5గంటలకు అడుగుపెట్టనున్నారు. 'ఐదు దేశాలు, 45కు పైగా సమావేశాలు..అది ఇక్కడ కావొచ్చు.. విదేశాల్లో కావొచ్చు.. నేను దేశం కోసమే పనిచేస్తున్నాను' అని మోదీ గత ఆదివారం దోహాలో చెప్పిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







