మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- April 20, 2024
న్యూయార్క్: మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఖతార్ అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. అన్ని దేశాలు సంయమనం పాటించాలని కోరింది. గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనకరమైన పరిణామాలపై విచారం వ్యక్తం చేసింది. త్రైమాసిక బహిరంగ చర్చకు ముందు "మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి’’ పై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో చర్చించారు. గాజా స్ట్రిప్‌లోని పరిస్థితిని అదుపు చేయాలని పిలుపునిచ్చారు. బాధితులకు ఆహారం మరియు అవసరమైన సేవలను అందజేయాలని కోరారు. రఫా నగరంలో ఇజ్రాయెల్ దళాలు ప్రారంభించిన సైనిక చర్యను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దురక్రమణ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న గాజాకు తక్షణ సాయాన్ని అందించాలని HE షేఖా అల్యా అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ పిలుపునిచ్చారు. గాజాలో మారణహోమాన్ని నిరోధించడానికి ఇజ్రాయెల్ పుష్కలంగా చర్యలు తీసుకోవడంపై అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇచ్చిన తీర్పును అమలు చేయడం అత్యవసరమని షేఖా అలియా అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?