'మనలో ఒకడు' చివరి షెడ్యూల్‌..

- June 07, 2016 , by Maagulf
'మనలో ఒకడు' చివరి షెడ్యూల్‌..

ఆర్పీ పట్నాయక్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మనలో ఒకడు'. 'నువ్వు నేను' ఫేమ్‌ అనితా హెచ.రెడ్డి కథానాయిక. యూనిక్రాఫ్ట్‌ మూవీ పతాకంపై జి.సి.జగనమోహన్ నిర్మిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ''90 శాతం షూటింగ్‌ పూర్తయింది. కృష్ణమూర్తి అనే మామూలు లెక్చరర్‌ కథ ఇది. కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆర్పీగారి 'బ్రోకర్‌'ను మించేలా ఉంటుంది. నాలుగు పాటలున్నాయి. ఒక పాట, క్లైమాక్స్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈ నెల 16 నుంచి నెలాఖరు వరకు జరిపే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి'' అని చెప్పారు.సాయికుమార్‌, నాజర్‌, తనికెళ్ళ భరణి, జయప్రకాశ్ రెడ్డి, శ్రీముఖి, రఘుబాబు, బెనర్జీ, గొల్లపూడి మారుతీరావు, రాజా రవీంద్ర, జెమిని సురేశ్, దువ్వాసి మోహన్, సందేశ్, గిరిధర్‌, వరుణ్‌, గుండు సుదర్శన్, కృష్ణవేణి, జబర్దస్త్‌ రాకేశ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: ఎస్‌.జె.సిద్ధార్థ్‌, ఎడిటింగ్‌: ఉద్ధవ్‌, ఆర్ట్‌: కృష్ణ, మాటలు: తిరుమల్‌ నాగ్‌, సహ నిర్మాతలు: ఉమేశ గౌడ్, బాలసుబ్రహ్మణ్యం, కథ-స్ర్కీనప్లే-సంగీతం-దర్శకత్వం: ఆర్‌.పి.పట్నాయక్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com