మహావీర్ జయంతి
- April 21, 2024
జైన మతస్తులకు మహావీర్ జయంతి ఎంతో ప్రత్యేకమైనది. ధర్మాన్ని ప్రచారం చేసే గురువుగా మహావీరుడు ప్రసిద్ధి చెందాడు. హిందూ పంచాంగం ప్రకారం ఛైత్ర మాసంలోని శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి రోజున మహావీర్ జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 21న మహావీరుని జయంతి. ఆయన జయంతి రోజు జైన మతస్తులకు పరమ పవిత్రమైన దినం. మహావీర్ జయంతి రోజున జైన మతస్తులు ఆయన గౌరవార్ధం ప్రభాత్ ఫేరీ, ఊరేగింపు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందాలంటే ఐదు సూత్రాలను తప్పక పాటించాలని మహావీరుడు బోధించాడు. మహావీరుడు బోధించిన అహింస, అస్తేయ, బ్రహ్మచర్యం, సత్యం, అపరిగ్రహం అనే ఈ ఐదు సూత్రాలను మహావీర్ జయంతి రోజున ప్రజలందరూ స్మరించుకుంటూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజున కఠినమైన ఉపవాస వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.
క్రీస్తుపూర్వం 599వ సంవత్సరంలో బీహార్‌లోని వైశాలికి సమీపంలోని కుండల గ్రామంలో మహావీర్ రాజు సిద్ధార్థ, రాణి త్రిసాల దంపతులకు మహావీర్(వర్థమాన్) జన్మించినట్లు చెబుతారు. తను 28 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. ఆ సమయంలో యశోధరను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె పుట్టింది.
రాజ కుటుంబంలో పుట్టిన మహావీరునికి విలాసాలు, సౌకర్యాలకు ఏ మాత్రం లోటు ఉండేది కాదు. అయితే తను ఎప్పటికీ వాటిని కోరుకులేదు. తనను ఖరీదైనవి ఏవీ ఆకర్షించలేదు. ఎప్పుడు కూడా తన ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో మహావీరుడు వైరాగ్యంతో తన 36వ ఏట రాజ్యాన్ని, ఐహిక సుఖాలను వదిలివేసి అంతర్గత శాంతి కోసం, ప్రశాంతం కోసం అడవులకు వెళ్లి దాదాపు 12 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు.
12 సంవత్సరాల కఠిన తపస్సు తర్వాత మహావీరునికి జ్ఞానోదయం కలిగి మహావీరుడిగా మారాడు. తాను సంపాదించిన జ్ఞానాన్ని నలుగురికి పంచి పెట్టడానికి మగధ రాజ్యంతో పాటు తూర్పునకు వెళ్లి తన సిద్ధాంతాలను బోధించాడు. బింబిసారుడు, అజాత శత్రువు తదితర రాజులను కలుసుకున్నాడు.
దేశం నలుమూల తిరిగి తన సిద్ధాంతాలను వ్యాప్తి చేసిన మహావీరుడు తన 72వ ఏట తుది శ్వాస విడిచారు. ఇంతకు మునుపు 23 మంది తీర్ధంకరులు ఉన్న మహావీరుని హయాంలోనే జైన మతానికి విశేషమైన గుర్తింపు వచ్చింది. అందుకే 32 సంవత్సరాల పాటు అహింస, ధర్మం గురించి ప్రచారం చేసిన మహావీరుడు జైనులకు ఆరాధ్య దైవమయ్యారు. ఆయన జయంతి ప్రతి ఏటా ఒక ఉత్సవంలా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







