‘అశ్వత్థామ’గా అమితాబ్ బచ్చన్..
- April 21, 2024
హైదరాబాద్: ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898AD’ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని అంతా భావిస్తున్నారు. ఈ సినిమాని నిర్మాత అశ్విని దత్ 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మేలో ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఎన్నికల టైం కావడంతో కల్కి మరోసారి వాయిదా పడింది.
తాజాగా నేడు ఈ సినిమా నుంచి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని రివీల్ చేసారు. ఐపీఎల్ మూడ్ లో అందరూ ఉండగా దానికి ఇంకొంచెం హ్యాపినెస్ ఇస్తూ స్టార్ స్పోర్ట్స్ లో అమితాబ్ బచ్చన క్యారెక్టర్ రివీల్ చేశారు. ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామగా కనపడబోతున్నట్టు, ద్వాపర యుగం నుంచి విష్ణువు చివరి అవతారం కల్కి కోసం ఎదురుచూస్తున్నట్టు ఈ గ్లింప్స్ ద్వారా తెలిపారు.
దీంతో మరోసారి కల్కి సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా 6000 సంవత్సరాల కథతో జరుగుతుందని, ఈ సినిమాలో పురాణాల ప్రకారం చెప్పిన ఏడుగురు చిరంజీవులు ఉంటారని వార్తలు వచ్చాయి. అమితాబ్ ని అశ్వత్థామ క్యారెక్టర్ గా చూపించడంతో అంతా ఈ వార్తలు నిజమే అవుతాయని భావిస్తున్నారు. కల్కి సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?