కృతి శెట్టి బౌన్స్ బ్యాక్ అవుతుందా.?
- April 22, 2024
స్టార్ హీరోయిన్‌గా టాప్ చెయిర్‌ని అధిరోహించినట్లే అధిరోహించి ఢమాల్‌న కింద పడిపోయినట్లైంది కృతి శెట్టి పరిస్థితి. వరుస ఆఫర్లు.. కొంత కాలం పాటు ఏ సినిమాలో చూసినా కృతి శెట్టినే.. హీరో మాత్రమే వేరు.. హీరోయిన్ కృతి శెట్టి.. అంతే అన్నట్లుగా వుంది.
కానీ, ఆమె చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయిపోవడంతో ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింద. రొటీన్ రొట్ట కొట్టుడుతో కృతి శెట్టి బోర్ కొట్టించేసింది. వచ్చిన ప్రతీ ఆఫర్‌నీ అంది పుచ్చేసుకుంటే ఇలాగే వుంటుంది అని కృతి శెట్టిని అప్పట్లో తెగ ట్రోల్ చేసేశారు.
దాంతో, అందం, అభినయం వున్న అందాల భామ కృతి శెట్టి టాలీవుడ్‌కి దూరమైపోయింది. మళ్లీ ఇప్పుడే ‘మనమే’ సినిమాతో రాబోతోంది. శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ బాబుకు తల్లిగా నటిస్తోంది కృతి శెట్టి.
అదే క్యూట్ అప్పీల్.. ఆకట్టుకునే అభినయం.. అన్నీ వున్నా ఎందుకో సినిమాకి వుండాల్సిన కళ అయితే కనిపించడం లేదు. ఏమో కొన్ని సినిమాలు పోస్టర్లతో ఎట్రాక్ట్ చేస్తాయ్. తీరా రిలీజ్ తర్వాత డిజప్పాయింట్ చేస్తాయ్. కొన్ని సినిమాలు పోస్టర్లలో విషయం లేకపోయినా రిలీజ్ తర్వాత విపరీతంగా ఆకట్టుకుంటాయ్.
అలా ‘మనమే’ హిట్ అయితే కనుక మళ్లీ కృతి శెట్టి ఈజ్ బ్యాక్.. ఇది పక్కా.!
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?