‘రాజా సాబ్’.! ప్లానింగ్ గట్టిగానే.!
- April 22, 2024
ప్రబాస్ సినిమాలంటే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్న చందంగా మారిపోయాయ్. తాజా సినిమాల్లో ఒకటైన ‘రాజా సాబ్’ మాత్రం సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది.
మారుతి డైరెక్షన్లో రూపొందుతోన్న ఈ సినిమా ప్రబాస్ ఇంతవరకూ చేసిన జోనర్లన్నింటికీ భిన్నంగా రూపొందుతోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
కాగా, ఈ సినిమాకి సంబంధించి ఓ మెస్మరైజింగ్ అప్డేట్ త్వరలో రానుందట.. అని ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇంతవరకూ పోస్టర్ మాత్రమే వదిలారు.
ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారట. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అనేలా వుండబోతోందట ఈ ఆడియో సింగిల్. అన్నట్లు ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు ప్రబాస్‌తో జత కడుతున్నారు.
మాళవిక మోహనన్ మెయిన్ లీడ్ హీరోయిన్ కాగా, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కూడా ప్రబాస్‌తో ఆన్ స్ర్కీన్ రొమాన్స్‌కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని డిశంబర్‌లో రిలీజ్ చేసేందుకు మారుతి సన్నాహాలు చేస్తున్నాడట. ఒకవేళ తప్పితే ఖచ్చితంగా సంక్రాంతి రేస్‌లో ఈ సినిమా ప్రభంజనం సృష్టించాలని ప్లాన్ చేస్తున్నాడట.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?