రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ సినిమా టైటిల్ టీజర్ వచ్చేసింది..
- April 22, 2024
చెన్నై: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ తన 171వ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ నుంచి రజిని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసారు. తాజాగా నేడు ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ చిత్రానికి ‘కూలీ’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.
ఇక ఇన్ని రోజులు డ్రగ్స్ మాఫియా చుట్టూ కథల్ని నడిపించిన లోకేష్ కనగరాజ్.. ఈ సినిమాలో గోల్డ్ మాఫియాని చూపించబోతున్నట్లు తెలుస్తుంది టీజర్ చూస్తుంటే. మూడు నిముషాలు పాటు ఉన్న ఈ టీజర్ ని యాక్షన్ కట్ తో రెడీ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి.. సినిమా పై భారీ అంచనాలనే క్రియేట్ చేసారు. మరి ఆ టీజర్ ని మీరు కూడా చూసేయండి.
ఇక ఈ టీజర్ తో మరి విషయం కూడా అర్ధమయ్యిపొయింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో ఈ మూవీకి ఏ సంబంధం లేదని. ఈ చిత్రాన్ని స్టాండ్ ఎలోన్ మూవీగానే తీసుకు వస్తున్నట్లు తెలుస్తుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వాటిలో ఎంత నిజముందో తెలియదు. ఈ చిత్రాన్ని తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?