విజయవాడ 'మినీ ధియేటర్' చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం
- June 07, 2016
ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన 'మినీ ధియేటర్'లో మొదటి షో కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 1200 రూపాయలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసారు. అయితే ఇంత మొత్తం వెచ్చించి, ఇంతకీ ఏ సినిమా చూసారంటే. గతేడాది టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టిన 'శ్రీమంతుడు' సినిమా!
ఆ సినిమా విడుదలైన సమయంలోనే 'శ్రీమంతుడు'ను చూసిన చంద్రబాబు, మరోసారి 'వై స్క్రీన్' ప్రారంభం సందర్భంగా వీక్షించారు. దేశంలోనే ఆర్టీసీ బస్టాండ్ లో తొలి థియేటర్ గా రికార్డులకు ఎక్కిన 'వై స్క్రీన్'లో తొలి తాంబూలం మహేష్ బాబు 'శ్రీమంతుడు'కు దక్కింది.మొత్తం సినిమాను వీక్షించడానికి సమయం లేకపోయినా, కాసేపు చూసిన తర్వాత అమరావతికి పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, శిద్ధా రాఘవరావు, అధికారుల టికెట్లు కూడా చంద్రబాబు నాయుడే కొనుగోలు చేసారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







