'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- April 23, 2024
కువైట్: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన క్షమాభిక్ష పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 1,807 మంది రెసిడెన్సీ ఉల్లంఘించినవారు కువైట్‌ను విడిచివెళ్లారు. 4,565 మంది ప్రవాసులు తమ నివాస స్థితిని సరి చేసుకున్నారు. వాటిలో ఎక్కువ భాగం ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 18 రెసిడెన్సీ పరిధిలో ఉన్నవే. అయితే కొద్ది మంది విజిట్ వీసా హోల్డర్లు కూడా దేశం విడిచి వెళ్ళడానికి క్షమాభిక్ష పథకాన్ని ఉపయోగించుకున్నారు. నివేదిక ప్రకారం.. దాదాపు 2,801 మంది ప్రవాసులు, తమ పాస్‌పోర్ట్‌లను పోగొట్టుకున్నారు లేదా వారి స్పాన్సర్ల ఆధీనంలో ఉన్నారు. వీరందరూ దేశం విడిచి వెళ్ళడానికి వారి రాయబార కార్యాలయాల నుండి ప్రయాణ పత్రాలను పొందారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?