విలక్షణమైన నటుడు

- April 23, 2024 , by Maagulf
విలక్షణమైన నటుడు

భారత చలన చిత్ర పరిశ్రమలోని విలక్షణ నటుల్లో మనోజ్ బాజ్‌పాయ్ ఒకరు. బాలీవుడ్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో దేశవ్యాప్తంగా తన ఫాలోయింగ్ పెంచుకున్నారు. నేడు మనోజ్ బాజ్‌పాయ్ పుట్టినరోజు.

మనోజ్ బాజ్‌పాయ్ 1969,ఏప్రిల్ 23వ తేదీన బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెల్వా అనే కుగ్రామంలో జన్మించారు. మనోజ్ చిన్నతనంలోనే నటన పట్ల ఆసక్తి ఏర్పడటం వల్ల డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఢిల్లీలోని "నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా"కు అప్లై చేసిన రిజెక్ట్ కావడంతో ప్రముఖ రంగస్థల నటుడు రఘుబీర్ యాదవ్ సలహా మేరకు ప్రముఖ నట శిక్షకుడు బెర్రీ జాన్  వద్ద శిక్షణ పొందారు.  

మనోజ్ కెరీర్ ప్రారంభంలో సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డారు. సినిమాలో చిన్న చిన్న పాత్రలు వేస్తూనే, దూరదర్శన్ లో సీరియల్స్ లో నటిస్తూ వచ్చారు. 1998లో రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన "సత్య" చిత్రం ద్వారా నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు గాను మనోజ్ తొలి నేషనల్ అవార్డు అందుకున్నారు.  సత్య చిత్రం తరవాత మనోజ్ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

 మనోజ్ ప్రయోగాలను ఎల్లప్పుడూ ఇష్టపడతారు.హిట్లు, ఫ్లప్స్ సంబంధం లేకుండా అన్నిభాషలలో నటిస్తూ ఉన్నారు. తను నటించిన వేదం, భోస్లే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ , రాజనీతి వంటి పలు చిత్రాలే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా కరోనా సమయంలో మనోజ్ నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో అయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ గురించి మనోజ్ మాట్లాడుతూ  

"వెండితెరపై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన నేను ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ లో చేసిన  శ్రీకాంత్ తివారి పాత్రే తనను కొత్త తరానికి పరిచయం చేసింది.ఈ తరం వారికి గతంలో నేను నటించిన సినిమాలు తెలియవని.. వాళ్లకు తెలిసింది శ్రీకాంత్ తివారి మాత్రమే, టీనేజ్ పిల్లలు నా దగ్గరకొచ్చి సెల్ఫీలు అడుగుతుంటారు.. గతంలో నాకు ఈ రకం ఫ్యాన్ బేస్ లేదు .. ఫ్యామిలీ సిరీస్ కారణంగా నాకు కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పడింది "

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తర్వాత మనోజ్ నటించే చిత్రాల మీద ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్లే  వైవిధ్య కథలను ఎంచుకుంటూ మనోజ్ ముందుకు సాగుతున్నారు.  

               --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com