బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!

- April 23, 2024 , by Maagulf
బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!

యూఏఈ: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ (సిబియుఎఇ) భారీ వర్షాలతో ప్రభావితమైన కస్టమర్లకు వ్యక్తిగత, కారు రుణాల వాయిదాల చెల్లింపును ఆరు నెలల పాటు వాయిదా వేయడానికి అనుమతించాలని అన్ని బ్యాంకులు, బీమా కంపెనీలకు నోటీసు జారీ చేసింది. వాయిదాల చెల్లింపు వాయిదా కోసం అదనపు రుసుములు, వడ్డీ లేదా లాభాలు విధించకుండా లేదా రుణం యొక్క అసలు మొత్తాన్ని పెంచకుండా వాయిదా వేయాలని సూచించింది. గత వారం భారీ వర్షాల కారణంగా వాహనాలు, గృహాలకు జరిగిన నష్టాలు..  బీమా పాలసీ ఉన్నట్లయితే లేదా సాధారణంగా 'సమగ్ర'గా సూచించబడినట్లయితే బీమా పరిధిలోకి వస్తుందని సెంట్రల్ బ్యాంక్ ధృవీకరించింది. ఇది ఇళ్లకు కూడా వర్తిస్తుందని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. 

బీమా హక్కులను పరిరక్షించడానికి బీమా పాలసీని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలని, బీమా కంపెనీతో ఫిర్యాదు లేదా వివాదం ఉన్నట్లయితే, ఆర్థిక మరియు బీమా అంబుడ్స్‌మెన్ అయిన SANADAKని సంప్రదించాలని సెంట్రల్ బ్యాంక్ ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com