విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్‌లు
- April 24, 2024
యూఏఈ: యూఏఈతో సహా జీసీసీలోని విద్య, విమానయానం మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలు సైబర్ అటాక్ లకు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ మేరకు 2024 గల్ఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎక్స్పో & కాన్ఫరెన్స్ (GISEC) సందర్భంగా హెల్ప్ AG ఈ ఫలితాలను వెల్లడించింది. వారి డేటా ప్రకారం, 36 శాతం సైబర్‌టాక్‌లు విద్యా రంగాన్ని లక్ష్యంగా చేసుకోగా, 29 శాతం విమానయానాన్ని మరియు 15 శాతం ఆరోగ్య సంరక్షణను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ రంగాలు కలిపి GCCలోని 80 శాతం లక్ష్య సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని హెల్ప్ AG సీఈఓ స్టీఫన్ బెర్నర్ తెలిపారు. ఇందులో బ్రాండ్ దుర్వినియోగం 49 శాతం, డేటా లీకేజ్ మరియు ఫిషింగ్ 10 శాతం, 1.5 శాతం వినియోగ కేసులను సూచిస్తున్నాయని వెల్లడించారు.ఈ రంగాలలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నందున ప్రభుత్వ సంస్థలు ఎనిమిది శాతం దాడులను ఎదుర్కొన్నాయని, పెట్టుబడి రంగాలు ఏడు శాతం మరియు బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగాలు నాలుగు శాతం ఎదుర్కొన్నాయని విశ్లేషించారు.
మరోవైపు గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ మార్కెట్ పరిమాణం 2024లో సుమారుగా $183 బిలియన్లుగా అంచనా వేయబడిందని, 2028 నాటికి 10.56 శాతం వార్షిక వృద్ధి రేటు $273.6 బిలియన్లకు చేరుతుందని అంచనా వేసినట్లు దుబాయ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సెంటర్ (DESC) UAEకి చెందిన సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ సెక్టార్ సీఈఓ అమెర్ షరాఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?