ఒమనీయుల్లో బ్లడ్‌ డిజార్డర్‌ జీన్‌

- June 07, 2016 , by Maagulf
ఒమనీయుల్లో బ్లడ్‌ డిజార్డర్‌ జీన్‌

 


ఒమనీయుల్లో చాలామంది బ్లడ్‌ డిజాస్టర్‌ జీన్‌ని కలిగి ఉన్నారనీ తాజాగా ఓ పరిశోధనలో తేలింది. దేశంలో 60 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇందులో కూడా అతి సాధారణమైన సమస్యగా డి6పిడి డిఫీషియన్సీ అనే రుగ్మతను గుర్తించారు. 28 మంది పురుషులు 12 మంది మహిళలు ఈ రుగ్మతతో బాధపడుతున్నారని ఒమన్‌ నేషనల్‌ జెనెటిక్‌ సెంటర్‌ సీనియర్‌ మాలిక్యులర్‌ అండ్‌ కమ్యూనిటీ జెనెటిసిస్ట్‌ డాక్టర్‌ ముసాలమ్‌ బిన్‌ అల్‌ అరామి చెప్పారు. ఇంతలా ఈ రుగ్మత వ్యాప్తి చెందడానికి కారణం ఒక సమూహంలోనే వివాహాలు జరుగుతుండడమని ఆయన స్పష్టం చేశారు. మెటబాలిక్‌ డిజాస్టర్స్‌ మరియు ఫీడింగ్‌ డిజాస్టర్స్‌ 20.7 జెనెటిక్‌ సమస్యలని పరిశోధనల్లో తేలింది. ఐదు నుంచి ఏడు శాతం మంది ఒమనీయులు తమ పిల్లలకు జెనెటిక్‌ సమస్యలను ఇస్తున్నారని, ప్రపంచ వ్యాప్తంగా ఈ శాతం 4.5 మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. జెనెటిక్‌ సమస్యలతో 10 శాతం మంది ఇన్‌ఫాంట్స్‌గా ఉన్నప్పుడే చనిపోతున్నారనీ, 52 శాతం మంది పసిపిల్లలుగానే చనిపోతున్నారని తేలింది. ఒమన్‌లో సుమారు 300 రకాలైన జెనెటిక్‌ డిజార్డర్స్‌ని గుర్తించారు. వైద్యరంగంపైనా, ఆర్థిక రంగంపైనా ఈ సమస్యలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెళ్ళికి ముందు తగిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ సమస్యలను అదిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com