క్రికెట్ దేవుడు
- April 24, 2024
సచిన్ టెండూల్కర్.. క్రికెట్‌లో ఇది పేరు కాదు ఓ బ్రాండ్. రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని తన బ్యాటింగ్‌తో ఉర్రూతలూగించిన మాస్టర్ బ్లాస్టర్.. శిఖరాగ్ర స్థాయి రికార్డుల్ని నెలకొల్పాడు. ‘క్రికెట్ గాడ్’, ‘లిటిల్ మాస్టర్’ అంటూ ఫ్యాన్స్ అభిమానంగా పిలుచుకునే సచిన్ రమేష్ టెండుల్కర్ ప్రపంచ క్రికెట్ దిగ్గజాలలో ఒకరు. ఈరోజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు.
సచిన్ ఏప్రిల్ 24, 1973న ముంబాయిలో జన్మించాడు. క్రికెట్ పట్ల చిన్నతనంలోనే సచిన్ మక్కువ పెంచుకున్నాడు. 1989, నవంబరు 15న అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్.. 16 ఏళ్ల వయసులోనే పాకిస్థాన్ అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లని సమర్థంగా ఎదుర్కొన్నాడు.
కొద్దీ వ్యవధిలోనే తన ఆట తీరుతో స్టార్ క్రికెటర్‌గా ఎదిగిపోయాడు. క్రమంగా భారత్ జట్టు పేరుని ఒకవైపు, సచిన్ టెండూల్కర్ పేరుని మరోవైపు బోర్డుపై రాసుకుని మరీ ప్రత్యర్థి టీమ్ బౌలర్లు వ్యూహాలు రచించే స్థాయికి ఎదిగాడు. ప్రత్యర్థి, పిచ్, ప్రదేశంతో సంబంధం లేకుండా సచిన్ చెలరేగిన తీరుతో క్రికెట్ ప్రపంచమే పాదాక్రాంతమైంది.. బౌలర్లకి పీడకలల్ని మిగిల్చింది.
24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 200 టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ 53.79 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఆడిన 463 వన్డేల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు చేసిన సచిన్.. 49 శతకాలు, ఒక ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? వన్డే క్రికెట్‌లో ఫస్ట్ డబుల్ సెంచరీ సాధించింది సచిన్ టెండూల్కరే. 2010లో దక్షిణాఫ్రికాపై నమోదు చేశాడు. మొత్తంగా.. క్రికెట్ ప్రపంచంలో 100 అంతర్జాతీయ శతకాలు బాదిన సచిన్.. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్.
క్రికెట్ అనేది ఓ మతమైతే దానికి అతడో దేవుడని కీర్తిస్తుంటారు. క్రికెట్ లో అతడు సాధించని మైలురాయి లేదనే చెప్పాలి. ఇలా భారతీయ క్రికెట్లో ఓ వెలువెలిగిన లెజెండరీ ప్లేయరే సచిన్ టెండూల్కర్.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు