బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- April 24, 2024
హైదరాబాద్: ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) కీలక నిర్ణయం తీసుకుంది.
ఉప్పల్ మార్గంలో మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు చెప్పింది. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో చివరి రైళ్లు రాత్రి 12:15 గంటలకు బయల్దేరి 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటుంది అని మెట్రో అధికారులు తెలిపారు.
“హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపిఎల్ మ్యాచ్ కోసం మాత్రమే ఉప్పల్, స్టేడియం, ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్లలో షెడ్యూల్ అవర్స్కి మించి ప్రవేశానికి అనుమతి ఉంది. ఇతర స్టేషన్లలో నిష్క్రమణలు మాత్రమే అందుబాటులో ఉంటాయి” అని హైదరాబాద్ మెట్రో రైలు ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో ఇప్పటి వరకు సన్రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచులు ఆడింది. ఐదు మ్యాచుల్లో విజయం సాధించింది. 10 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. 8 మ్యాచులు ఆడగా ఏడింటిలో ఓడిపోయింది. రెండు పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.
కాగా.. ఉప్పల్లో జరిగే మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ దిశగా మరో అడుగు వేయాలని హైదరాబాద్ పట్టుదలగా ఉండగా.. పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరచుకోవాలని ఆర్సీబీ అనుకుంటోంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు