జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు

- April 24, 2024 , by Maagulf
జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు

బహ్రెయిన్: సౌదీ అరేబియా, ఒమన్ మరియు బహ్రెయిన్ నుండి వచ్చిన పౌరుల కోసం యూరోపియన్ యూనియన్ వీసా నిబంధనలలో గణనీయమైన సడలింపును ప్రకటించింది. ఈ గల్ఫ్ దేశాలకు బహుళ-ప్రవేశ వీసాల జారీని అప్డేట్ చేయడానికి యూరోపియన్ కమిషన్ మూడు అమలు నిర్ణయాలను ప్రకటించింది.  లక్సెంబర్గ్‌లో జరిగిన ప్రాంతీయ భద్రత మరియు సహకారంపై EU-GCC హై-లెవల్ ఫోరమ్ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. బహ్రెయిన్ ప్రతినిధి బృందం అధిపతి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా,  బెల్జియంలోని బహ్రెయిన్ రాయబారి అబ్దుల్లా బిన్ ఫైసల్ బిన్ జబర్ అల్ దోసరీ పాల్గొన్నారు కొత్తగా సవరించిన వీసా నిబంధనల ప్రకారం.. బహ్రెయిన్, ఒమన్ మరియు సౌదీ అరేబియాలో నివసిస్తున్న జాతీయులు ఇప్పుడు బహుళ-ప్రవేశ వీసాలకు అర్హులు అవుతారు. వారు ఒకే వీసాతో ఐదేళ్లలో అనేకసార్లు ఈయూని సందర్శించవచ్చు.   29 యూరోపియన్ దేశాలలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ-ట్రావెల్ జోన్‌గా పేరుగాంచిన స్కెంజెన్ ప్రాంతం.. గత ఫిబ్రవరిలో బల్గేరియా, రొమేనియాలను చేర్చుకున్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com