‘హనుమాన్’ సక్సెస్ వెనక నిజంగా ఆ హనుమంతుడి ఆశీస్సులే.!
- April 24, 2024యువ నటుడు తేజ సజ్జా హీరోగా రూపొందిన ‘హనుమాన్’ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు.
దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమాని ఆదిలోనే తొక్కేయాలని అనంత ప్రయత్నాలు జరిగాయ్. ఎలాగైనా సినిమాని ఆపేయాలనుకున్నారు. మేలో రిలీజ్ కావల్సిన సినిమాని సంక్రాంతి బరిలో దించితే.. అప్పుడు కూడా ధియేటర్లు ఇవ్వక.. విడుదల పోస్ట్ పోన్ చేసుకోవాలని అనేక రకాలా ఒత్తిడులు తీసుకొచ్చి చాలా చాలా అణగదొక్కేసే ప్రయత్నం చేశారు.
కానీ, హనుమంతుడు ఈ సినిమాని వెనకుండి నడిపించినట్లయ్యింది. ఎంతలా తొక్కేయాలని చూశారో అంతలా ఎగసి ఎగసి వసూళ్లు సాధించింది. నిలబడింది. ఈ జనరేషన్ వాళ్లకి 100 రోజుల సినిమా ఫంక్షన్ అంటే ఇది.. అని ‘హనుమాన్’ సినిమా ఓ నిరూపణగా నిలిచింది.
ఈ సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు కానీ, రిలీజయ్యాకా కానీ, ఇంత సక్సెస్ అవుతుందని టీమ్ ఊహించలేదు. ఆ మాటకొస్తే.. ఎవ్వరూ ఊహించి వుండరు. నిజంగా ఆ హనుమంతుడి ఆశీస్సులు ఈ సినిమాకీ సినిమా యూనిట్‌కీ వుండడం వల్లే ఇంత పెద్ద సక్సెస్ ఈ సినిమాకి దక్కిందని చెప్పొచ్చు. నిజంగా చిత్ర యూనిట్‌నీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మనీ మెచ్చుకొని తీరాలి ఈ సినిమా సక్సెస్ విషయంలో. కష్టే ఫలి అనే విషయం ఇంకోసారి ప్రూవ్ అయ్యింది ఈ సినిమా విషయంలో.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి