‘హనుమాన్’ సక్సెస్ వెనక నిజంగా ఆ హనుమంతుడి ఆశీస్సులే.!
- April 24, 2024
యువ నటుడు తేజ సజ్జా హీరోగా రూపొందిన ‘హనుమాన్’ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ని గ్రాండ్గా నిర్వహించారు.
దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమాని ఆదిలోనే తొక్కేయాలని అనంత ప్రయత్నాలు జరిగాయ్. ఎలాగైనా సినిమాని ఆపేయాలనుకున్నారు. మేలో రిలీజ్ కావల్సిన సినిమాని సంక్రాంతి బరిలో దించితే.. అప్పుడు కూడా ధియేటర్లు ఇవ్వక.. విడుదల పోస్ట్ పోన్ చేసుకోవాలని అనేక రకాలా ఒత్తిడులు తీసుకొచ్చి చాలా చాలా అణగదొక్కేసే ప్రయత్నం చేశారు.
కానీ, హనుమంతుడు ఈ సినిమాని వెనకుండి నడిపించినట్లయ్యింది. ఎంతలా తొక్కేయాలని చూశారో అంతలా ఎగసి ఎగసి వసూళ్లు సాధించింది. నిలబడింది. ఈ జనరేషన్ వాళ్లకి 100 రోజుల సినిమా ఫంక్షన్ అంటే ఇది.. అని ‘హనుమాన్’ సినిమా ఓ నిరూపణగా నిలిచింది.
ఈ సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు కానీ, రిలీజయ్యాకా కానీ, ఇంత సక్సెస్ అవుతుందని టీమ్ ఊహించలేదు. ఆ మాటకొస్తే.. ఎవ్వరూ ఊహించి వుండరు. నిజంగా ఆ హనుమంతుడి ఆశీస్సులు ఈ సినిమాకీ సినిమా యూనిట్కీ వుండడం వల్లే ఇంత పెద్ద సక్సెస్ ఈ సినిమాకి దక్కిందని చెప్పొచ్చు. నిజంగా చిత్ర యూనిట్నీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మనీ మెచ్చుకొని తీరాలి ఈ సినిమా సక్సెస్ విషయంలో. కష్టే ఫలి అనే విషయం ఇంకోసారి ప్రూవ్ అయ్యింది ఈ సినిమా విషయంలో.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?