ఆ హీరోయిన్‌కి అంత పెద్ద సక్సెస్ వచ్చినా స్టార్డమ్ రాలేదే.!
- April 24, 2024ఒక్క సినిమా హీరోకైనా, హీరోయిన్‌కైనా దశ తిరగరాసేస్తుంది. కాజల్ అగర్వాల్‌కి ‘మగధీర’తో దశ తిరిగింది. అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతవరకూ చిన్న చిన్న సినిమాలతోనే సరిపెట్టుకున్న కాజల్, ఆ తర్వాత స్టార్ హీరోయిన్ ఛైర్ ఎక్కేసింది. ఆ స్టార్‌డమ్‌ని ఇంతవరకూ అలా నిలబెట్టుకుంటూ వస్తూనే వుంది.
తాజాగా ‘హనుమాన్’ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ అమృతా అయ్యర్ గురించి మనం మాట్లాడుకోవాలి. అమృతా అయ్యర్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో పరిచయమై ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.
అయితే, ‘హనుమాన్’ సినిమా అమృతా అయ్యర్‌కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు. ఏకంగా 300 కోట్లు వసూళ్లు సాధించడంతో పాటూ, వంద రోజుల ఫంక్షన్ కూడా సెలబ్రేట్ చేసుకున్న సినిమా ఇది. ఈ రోజుల్లో ఇది గ్రేట్ అచీవ్‌మెంట్‌గానే పరిగణించాలి.
అయితే, ఇంత జరిగినా అమృతా అయ్యర్‌కి ఈ సినిమాలో ఎంత మాత్రమూ క్రెడిట్ దక్కకపోవడమే దురదృష్టం. ‘పూలమ్మే పిల్లా..’ సాంగ్ అమృతపైనే చిత్రికరించినప్పటికీ హీరో సజ్జాకీ, పాటల రచయితకీ, గాయకుడికీ, మ్యూజిక్ డైరెక్టర్‌కీ వచ్చిన పేరులో కాస్తయినా అమృతా అయ్యర్‌కి రాకపోవడం ఆశ్చర్యకరం.
అంతే కాదు, ఇంత పెద్ద సక్సెస్ దక్కిన ఈ సినిమాతోనైనా తనను తాను ప్రమోట్ చేసుకోలేకపోయింది అమృతా అయ్యర్. ‘హనుమాన్’ సినిమాకి సంబంధించి ఎంత గొప్ప చెప్పుకుంటున్నా.. అదేంటో హీరోయిన్ అమృతా అయ్యర్‌కి గోరంతైనా ఆ గొప్ప దక్కలేదు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం