సింగపూర్‌ ఆఫీస్‌ టవర్‌ని కొనుగోలు చేయనున్న ఖతార్‌ ఫండ్‌

- June 07, 2016 , by Maagulf
సింగపూర్‌ ఆఫీస్‌ టవర్‌ని కొనుగోలు చేయనున్న ఖతార్‌ ఫండ్‌



కతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ ది సావరీన్‌ వెల్త్‌ ఫండ్‌ ఆఫ్‌ ది మిడిల్‌ ఈస్టర్న్‌ కంట్రీ, బ్లాక్‌ రాక్‌ ఐఎన్‌సికి చెందిన ఏసియా స్క్వేర్‌ టవర్‌ 1 ని 2.5 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఇది సింగపూర్‌లో అతి పెద్ద ఆఫీస్‌ ట్రాన్జాక్షన్‌. ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ మరియు బ్లాక్‌ రాక్‌ సోమవారం దీనికి సంబంధించి స్పష్టతనిచ్చాయి. సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌లో అతి పెద్ద సింగిల్‌ టవర్‌ని ఈ రీజియన్‌లో ఖతార్‌ సొంతం చేసుకోనుంది. 43 అంతస్తులు కలిగిన ఈ టవర్‌ అమ్మకం విషయంలో బ్లాక్‌రాక్‌, మార్కెట్‌ రేటు కంటే తక్కువ రేటుకే ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీకి ఇవ్వనుంది. సింగపూర్‌ మార్కెట్‌లో డౌన్‌ ట్రెండ్‌ నడుస్తుండడంతో ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా కార్యాలయాల అద్దెలు తగ్గవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చాలా కార్యాలయాలు అమ్మకాల కోసం ముందుకొస్తున్నాయని, అయితే డిమాండ్‌ మాత్రం యధాతథంగా ఉందని వారంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com