హైవే ప్రమాదంలో 15 మంది మృతి

- June 07, 2016 , by Maagulf
హైవే ప్రమాదంలో 15 మంది మృతి



సౌదీ హైవేలో రమదాన్‌ మాసం తొలి రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. సాయంత్రం 5.52 నిమిషాల సమయంలో ప్రమాదానికి సంబంధించిన సమాచారం తమకు అందిందని ఎడ్‌ క్రిసెంట్‌ ప్రతినిథి అబ్దుల్లా అల్‌ మురైబైద్‌ చెప్పారు. తక్షణం ప్రమాద స్థలికి డాక్టర్ల బృందాన్ని పంపించామని, అప్పటికే 15 మంది చనిపోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారనీ, 14 మంది ఓ మోస్తరు గాయాలు, 11 మందికి తేలికపాటి గాయాలు అయ్యాయని, క్షతగాత్రులకు ప్రాథమిక సహాయం అందించి, ఆసుపత్రులకు తరలించామని అధికారులు చెప్పారు. ప్రమాదంలో మృతి చెందినవారిలో ఎక్కువమంది విదేశీయులే ఉన్నారు. రహదారిపై వాహనాల్ని నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఎంతగా అవగాహన కల్పిస్తున్నా, రోడ్లపై ప్రమాదాలు తగ్గడంలేదని అధికారులు చెప్పారు. ప్రమాదాల్ని అరికట్టేందుకు తాము ఎన్ని చర్యలు తీసుకున్నా, వాహనదారులు అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదాలు ఆపలేమని వారు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com