హైదరాబాద్‌ వేదికగా 18న ఫిల్మ్‌ఫేర్‌ వేడుకలు

- June 07, 2016 , by Maagulf
హైదరాబాద్‌ వేదికగా 18న ఫిల్మ్‌ఫేర్‌ వేడుకలు

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా అందజేసే ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలకు ఈ ఏడాది హైదరాబాద్‌ వేదికగా నిలుస్తోంది. 63వ ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాల వేడుకను హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈనెల 18న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి సినీనటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరై ఫిల్మ్‌ఫేర్‌ వివరాలను వెల్లడించారు. ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాల్లో తనకు చోటు దక్కడంపై రకుల్‌ ఆనందం వ్యక్తం చేశారు.
 ఏటా నాలుగు భాషల నటీనటుల మధ్య బంధాన్ని ఈ పురస్కారాలు మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తారలంతా హాజరుకానున్న ఈ వేడుకకు పెద్దయెత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 10 విభాగాల్లో ఓటింగ్‌ ద్వారా పురస్కారానికి ఎంపిక చేయనున్నారు. టాలీవుడ్‌ నుంచి ఉత్తమ చిత్రాలుగా బాహుబలి, భలే భలే మగాడివోయ్‌, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె, శ్రీమంతుడు చిత్రాలు పోటీ పడుతున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com