రజని తో మరోసారి నటించనున్న రమ్య

- June 07, 2016 , by Maagulf
రజని తో మరోసారి నటించనున్న రమ్య

తెలుగు ఇండస్ట్రీలో 90వ శతాబ్ధంలో తన అందాలతో కుర్రకారుకి మత్తెక్కించిన అందాల నటి రమ్యకృష్ణ వచ్చిన కొత్తలో పెద్దగా హిట్ సినిమాలు లేవు. తర్వాత అల్లుడుగారు,అల్లరిప్రియుడు లాంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అమ్మోరు చిత్రంలో గ్రామదేవతగా మెప్పించిన రమ్యకృష్ణ తర్వాత మంచి హిట్ చిత్రాల్లో నటించింది. ఇక దర్శకుడు కృష్ణవంశిని వివాహం చేసుకున్న తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అత్తగా,తల్లిగా నటిస్తూ మంచి పొజిషన్లో నిలిచింది. ఇక రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి' లో శివగామి పాత్రతో రమ్యకృష్ణ ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అంతే కాదు తెలుగు,తమిళ ఇండస్ట్రీ నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి.

 
ఈలోగా నాగార్జనతో 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రంలో నటించగా ఆ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తాజాగా రమ్యకృష్ణ మరో ఆఫర్ దక్కించుకుంది..అదే సూపర్ స్టార్ రజినీకాంత్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో నరసింహ చిత్రంలో రజినీకి ధీటుగా నీలాంబరి పాత్రలో నటించి మెప్పించింది. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ 'రోబో 2' లో కనిపించబోతుంది.
 
త్వరలో 'కబాలి'గా రానున్న రజనీ దర్శకత్వంలో 'రోబో 2.0'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2010లో వచ్చిన 'రోబో'కి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రకు రమ్యకృష్ణను సంప్రదించారట దర్శకుడు శంకర్. రమ్య కూడా అందుకు ఓకే అందని చెపుతున్నారు . త్వరలోనే రజనీ-రమ్యకృష్ణలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. దాదాపు పదిహఏడేళ్ళ తర్వాత 'నరసింహ' కాంబినేషన్ రిపీటవుతుండం అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com