తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- April 25, 2024
హైదరాబాద్: భారత దేశ వ్యాప్తంగా ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు అనేవి అనేకం జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది కన్నుమూస్తున్నారు. తాజాగా తెలంగాణ లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది యువకులు కన్నుమూశారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు సూర్యపేట జిల్లా కోదాడ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నందునే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మరో ప్రమాదం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. నలుగురు ఇంటర్ విద్యార్థులు ఒకే బైక్పై ఇల్లందు నుంచి వర్ధన్నపేట వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. వీరి మరణంతో వీరి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు