పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- April 25, 2024
పాట్నా: బిహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా కనీసం 30 మందికి పైగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన పాట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోలాండర్లో చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.
గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. సిలిండర్ పేలవడంతో క్షణాల్లోనే మంటలు భవనం మొత్తం వ్యాపించాయన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పలువురు గాయపడగా వారిని పాట్నాలోని పీఎంసీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
హోటల్ నుంచి 30 మందికి పైగా రక్షించినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ మిశ్రా తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో ప్రమాదం గురించి సమాచారం అందిందని, ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (ఫైర్ సర్వీస్) మృత్యుంజయ్ కుమార్ చౌదరి తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తం తీవ్ర గందరగోళం నెలకొంది. మంటల కారణంగా దట్టమైన పొగ ఆ ప్రాంతంలో అలుముకుంది.
పాట్నా రైల్వే స్టేషన్కు సమీపంలో ఈ హోటల్ ఉండడంతో చాలా మంది ఈ హోటల్లో భోజనం చేసేందుకు వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న హోంగార్డు, ఫైర్ సర్వీసెస్ డీజీ శోభా ఓహత్కర్ విలేకరులతో మాట్లాడుతూ.. 16,000 కంటే ఎక్కువ హోటళ్లలో ఫైర్ ఆడిట్ చేసినట్లు చెప్పారు. ఇంకా చాలా హోటళ్లలో ఆడిట్ కొనసాగుతోందన్నారు. తమ తనిఖీల్లో కొందరు సూచనలు పాటించలేదని తెలిసిందన్నారు. వారికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని చూస్తుంటే.. సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగినట్లు కనిపిస్తోంది అని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు