మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- April 25, 2024
రియాద్: మే 14, 15 తేదీల్లో "గ్రేట్ ఫ్యూచర్స్" వాణిజ్య ప్రదర్శనను రియాద్ వేదికగా నిర్వహించనున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వాలు ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నాయి. ఇది వ్యాపారం, పర్యాటకం మరియు సాంస్కృతిక రంగాలలో భాగస్వామ్యాన్ని పెంచనుంది. బ్రిటీష్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒలివర్ డౌడెన్ 350 మంది బ్రిటీష్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. రియాద్‌లోని కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో జరిగే రెండు రోజుల ఫ్లాగ్షిప్ ఈవెంట్లో దాదాపు 750 మంది ప్రతినిధులు పాల్గొంటారు. బ్రిటిష్ ప్రతినిధి బృందంలో 350 మందికి పైగా ప్రభుత్వ అధికారులు, బ్రిటిష్ వ్యాపార రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులు ఉంటారు. సౌదీ-బ్రిటీష్ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ప్రయత్నాలలో భాగంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించడంతో పాటు అనేక ఆశాజనక రంగాలలో ఇరుపక్షాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు వాణిజ్య మంత్రి డాక్టర్ మజేద్ అల్-కసాబీ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు