'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- April 27, 2024రామాయణం కథ ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.. అవన్నీ కూడా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు మరో సినిమా రాబోతుంది.. బాలీవుడ్ లో మరో రామాయణం సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
దంగల్ దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ లో రామాయణం తెరకెక్కబోతుంది. ఈ సినిమా గురించి ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ లేకుండానే సైలెంట్ గా షూటింగ్ ను మొదలు పెట్టినట్లు తెలుస్తుంది..
ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్, ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. కన్నడ స్టార్ హీరో యశ్ రావణాసురుడు పాత్రలో నటిస్తున్నాడు.. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్తూనే మేకర్స్ సినిమాను సైలెంట్ గా సెట్స్ మీదకు తీసుకెళ్లారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్ నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ ఫొటోల్లో రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా ముస్తాబై ఉన్నారు. మరో ఫొటోలో రణబీర్ కారవాన్ నుంచి వెళ్తున్నట్టు కనిపిస్తుంది.. సాయి పల్లవి ఆ గెటప్ లో చాలా అందంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఏ ఆర్ రెహమాన్, హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు..
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు