ఈ రామాయణం అంత ఆషా మాషీ కాదండోయ్.!
- April 27, 2024
రామాయణంపై ఇప్పటికే చాలా సినిమాలొచ్చేశాయ్. కొన్ని సూపర్ హిట్టు.. కొన్ని ఓ మాదిరి హిట్టు.. లేటెస్ట్ మూవీ ‘ఆది పురుష్’ అయితే అట్టర్ ఫ్లాప్.. ఇదీ రామాయణంకి చెందిన మూవీ హిస్టరీ.
అయినా కానీ, రామాయణంపై సినిమాలు తెరకెక్కించాలన్న ఆసక్తి తగ్గడం లేదు మన మేకర్లకి. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి ఈ జనరేషన్‌కి అర్ధమయ్యేలా ఓ రామాయణం తెరకెక్కించబోతున్నాడు.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. రాముడు, సీత పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ నటుడు ‘కేజీఎఫ్’ హీరో యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు.
అంతా బాగానే వుంది. కానీ, ఇటీవల ‘ఆది పురుష్’ సినిమా చూశాకా.. ఎలాంటి అనుభూతులు పొందారో సినీ ప్రేక్షకులు తెలిసిన సంగతే. సో, రామాయణం అనే కాన్సెప్ట్ టచ్ చేయాలంటే.. చాలా చాలా జాగ్రత్తగా వుండాలి. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ రామాయణం ఎలా అలరించబోతోందో.. కానీ, అంచనాలయితే బాగానే వున్నాయ్. సినిమా సోదిలో నిలుస్తోంది. ఇక లేటెస్ట్గా షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయిపోయాయ్.
రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసినట్లుగా కనిపిస్తోంది ఈ పిక్స్ చూస్తుంటే. మరి, కథ, కధనాలు నడిపిన తీరును బట్టి సినిమా రిజల్ట్ బేస్ అయ్యి వుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు