అభినయ తార ...!
- April 28, 2024
అందాల తార సమంత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరు సమంత. దశాబ్దకాలంగా భారత సినీ పరిశ్రమలో రాణిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తమిళ, తెలుగు చిత్రాల్లో అగ్ర కథానాయికగా వెలుగొందుతోంది. నేడు సమంత పుట్టిన రోజు.
1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించింది సమంత. తల్లిదండ్రులు రూత్ ప్రభు, నైనెట్టే. తండ్రి తెలుగు వారు కాగా.. తల్లి మలయాళీ. పుట్టింది, పెరిగింది అంతా చెన్నైలోనే. చదువు పూర్తి చేసుకున్న తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. నాయుడు హాల్ అనే ఫంక్షన్ హాలులో పాకెట్ మనీ కోసం పని చేసేది. తన కంటూ సొంత ఇళ్లు కట్టుకోవాలని ఆమె కల. ఆ కలనే తను సినీ రంగంలోకి ప్రయాణించేందుకు అడుగులు వేయించిందని చెప్పవచ్చు. నాయుడు హాల్ లోనే ఆమెకు రవివర్మ అనే సినీ రచయిత, దర్శకుడు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఆమె 2010లో సినీ రంగ ప్రవేశం చేసింది.
ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తొలి సినిమా 'ఏం మాయ చేసావే'తో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. ఈ సినిమా తమిళంలోనూ విడుదల కావడంతో రెండు సినీ పరిశ్రమలో ఒక్కసారిగా సమంత పేరు మారుమోగిపోయింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.
ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది సమంత. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. ఒక్కో సినిమాకు దాదాపు ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. హీరోలకు ధీటుగా ఏ మాత్రం తీసిపోకుండా వాళ్ళతో పోటీ పడుతూ సరి సమానంగా దూసుకుపోతుంది.
సమంత సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది .తన సంపాదన నుంచి కొంత మొత్తాన్ని ప్రత్యూష ఫౌండేషన్ సంస్థకు కేటాయిస్తూ వస్తుంది. అనేక మంది పేద మహిళలు, పిల్లకు ప్రాణదానం చేస్తున్నారు. ఇండస్ట్రీకి ఎంతమంది హీరోయిన్లు వస్తున్నప్పటికీ తనదైన నటనతో, అందంతో తనేంటో నిరూపించుకుని ఇప్పటికీ తన తర్వాతే ఎవరైనా అని నిరూపించుకుంటూ వస్తున్నది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు