తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- April 29, 2024
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏపీలో 25 పార్లమెంటరీ స్థానాలకు 503, 175 అసెంబ్లీ స్థానాలకు 2వేల 705 నామినేషన్లకు ఆమోదం తెలిపింది ఈసీ. ఆరు స్థానాల్లో కూటమి రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఉపసంహరించుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. విజయనగరం, ఉండి, పోలవరం, నూజివీడు, గన్నవరం, కావలి రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోలేదు. నామినేషన్ల ఉపసంహరణపై అధికారిక ప్రకటన చేయనున్నారు సీఈవో. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్దులకు ఆర్వోలు గుర్తులు కేటాయించనున్నారు. ఇక, ఒకే కుటుంబం నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన పలువురు అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
తెలంగాణలోనూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నామినేషన్ల పరిశీలన తర్వాత 1060 సెట్ల నామినేషన్లను ఈసీ ఆమోదించింది. అభ్యర్థులు భారీగా నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 625 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం తెలిపింది ఈసీ. 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు జాబితాను ఈసీ ప్రకటించనుంది.
ఏపీలో ఏ విధంగా నామినేషన్లు అధిక సంఖ్యలో నమోదయ్యాయో.. అదే స్థాయిలో నామినేషన్ల ఉపసంహరణ కూడా దాదాపుగా జరిగింది. అత్యధికంగా నంద్యాల పార్లమెంటుకు 36 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంటుకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీ స్థానాలను పరిశీలిస్తే.. అత్యధికంగా తిరుపతికి 48 నామినేషన్లు దాఖలు కాగా.. అత్యల్పంగా చోడవరం స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధానమైన స్థానాల్లో రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్లు వెనక్కి తీసుకోవడంలో వారు తగ్గలేదు.
కూటమికి సంబంధించి రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచారు. విజయనగరం, ఉండి, పోలవరం, నూజివీడు, గన్నవరం, కావలి స్థానాల్లో రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరు తమ నామినేషన్లు వెనక్కి తీసుకోకపోవడంతో ఈ స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎవరికి బీఫామ్ ఇస్తారో తెలియని పరిస్థితుల్లో టీడీపీ, కాంగ్రెస్ తరఫున ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. బీఫామ్ అందని వారు కొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. కుటుంబసభ్యులుగా కొందరు నామినేషన్లు దాఖలు చేశారు. వారు కూడా ఉపసంహరించుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్‌లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్‌లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్