అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు

- October 21, 2025 , by Maagulf
అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు

హైదరాబాద్: పోలీసు అరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ సిపి సుధీర్ బాబు అంబర్ పేట కార్ హెడ్ క్వార్టర్ లో డీసీపీలతో కలిసి పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని అన్నారు. 

విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని గుర్తు చేశారు. 

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తీవ్ర వాదుల చేతులలో అమరవీరులైన 16 పోలీస్ అమర వీరుల కుటుంబ సభ్యులను సత్కరించి, వారి యొక్క మంచి, చెడులను తెలుసుకొని మేము ఉన్నామని బరోసా ఇచ్చినారు.

అంబర్పేట్ కార్ హెడ్ క్వార్టర్ లో అమరవీరుల జ్ఞాపకార్ధం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుండి వందలాది పోలీస్ అధికారులు పాల్గొని రక్తదానం చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలు మరువలేనివని వారి జ్ఞాపకార్ధంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ క్రమంలో మల్కాజిగిరి డిసిపి పద్మజా, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు,డీసీపీ అడ్మిన్ ఇందిరా, డీసీపీ విమెన్ సేఫ్టీ ఉషా రాణి, డీసీపీ మహేశ్వరం సునీత రెడ్డి, డీసీపీ ట్రాఫిక్-1 శ్రీనివాస్, డీసీపీ ట్రాఫిక్-2 శ్రీనివాసులు,సైబర్ క్రైమ్స్ డీసీపీ నాగలక్ష్మి, రోడ్ సేఫ్టీ డీసీపీ మనోహర్, డీసీపీ హెడ్ క్వార్టర్ శ్యామ్ సుందర్, అడిషనల్ డీసీపీలు, ఏసిపి లు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com