క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక

- October 21, 2025 , by Maagulf
క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లను ఉపయోగించే యూజర్లకు భద్రతాపరమైన హెచ్చరిక జారీ చేసింది. ఈ రెండు ప్రముఖ బ్రౌజర్‌లలో గుర్తించిన తీవ్రమైన సైబర్ లోపాలు కారణంగా, హ్యాకర్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసే ప్రమాదం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ (CERT-In) వెల్లడించింది. CERT-In తాజా అడ్వైజరీ ప్రకారం, పాత వెర్షన్‌లను ఉపయోగిస్తున్న వారిలో డేటా హ్యాకింగ్, పాస్‌వర్డ్ లీక్, మాల్వేర్ ఇన్‌స్టాలేషన్ వంటి ప్రమాదాలు ఉన్నాయని పేర్కొంది. హ్యాకర్లు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ల ద్వారా యూజర్ల సిస్టమ్‌లోకి చొరబడి, హానికరమైన కోడ్‌ను నడిపే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా, ఈ భద్రతా లోపాలను వాడుకుని డినయల్ ఆఫ్ సర్వీస్ (DoS) దాడులు జరగవచ్చని తెలిపింది. ప్రధానంగా Windows, macOS, Linux వంటి డెస్క్‌టాప్ యూజర్లు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని సూచించింది.

సైబర్ ముప్పుల నుంచి రక్షణకు సూచనలు
యూజర్లు తమ బ్రౌజర్‌లను వెంటనే తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. గూగుల్,మొజిల్లా సంస్థలు ఇప్పటికే భద్రతా ప్యాచ్‌లు విడుదల చేశాయి. అనుమానాస్పద లింకులు లేదా తెలియని వెబ్‌సైట్‌లను తప్పించుకోవాలి.

క్రోమ్ అప్‌డేట్ విధానం:
క్రోమ్ ఓపెన్ చేసి, పైభాగంలోని మూడు చుక్కల మెనూను క్లిక్ చేయండి. Help → About Google Chrome ఎంపిక చేయండి. బ్రౌజర్ ఆటోమేటిక్‌గా తాజా అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేస్తుంది. అప్‌డేట్అ యిన తర్వాత ‘Relaunch’ బటన్ నొక్కండి.

ఫైర్‌ఫాక్స్ అప్‌డేట్ విధానం:
ఫైర్‌ఫాక్స్ ఓపెన్ చేసి, మూడు అడ్డగీతల (Menu) గుర్తు పై క్లిక్ చేయండి. Help → About Firefox ఎంపిక చేయండి. బ్రౌజర్ ఆటోమేటిక్‌గా తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది.

CERT-In సూచన:
సైబర్ దాడుల ప్రమాదాన్ని నివారించడానికి, యూజర్లు తక్షణమే బ్రౌజర్‌లను అప్‌డేట్ చేసి సురక్షిత బ్రౌజింగ్‌ను కొనసాగించాలని ప్రభుత్వ సంస్థ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com