‘కల్కి’పై ఆ రూమర్లు.! టేక్ లైట్ అంటోన్న నాగ్ అశ్విన్.!
- April 30, 2024
లార్జ్ స్కేల్లో రూపొందుతోన్న చిత్రం ‘కల్కి’. వైజయంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది. నాగ్ అశ్విన్ తన విజన్‌ని దృశ్య రూపంలో చూపించబోతున్నారు. టైమ్ లైన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందబోతోందన్న సంగతి తెలిసిందే.
త్వరలో రిలీజ్ కాబోయే ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయ్. అందులో భాగంగానే ఇటీవల సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్‌పై అనేక ట్రోల్స్ జరుగుతున్నాయ్.
ఈ సినిమాలో అనేక సన్నివేశాలూ, పోస్టర్లు కొన్ని హాలీవుడ్ సినిమాల్లోంచి డైరెక్ట్‌గా ఎత్తేశారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఖండించారు.
ఓ పెద్ద సినిమాకి ఇలాంటి దుష్ప్రచారాలు చాలా సహజమైపోయాయ్. అయినా కానీ, ప్రబాస్ ఫ్యాన్స్ ఇలాంటి రూమర్లను పట్టించుకోవద్దనీ, ఖచ్చితంగా ‘కల్కి’ సినిమా తెలుగు సినిమా తెరపై ఓ అత్యద్భుతమవుతుందని హామీ ఇస్తున్నా.. అని చెప్పారు.
చాలా కష్టపడి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఇక, నిర్మాణానంతర పనుల్లో ‘కల్కి’ టీమ్ బిజీగా వుంది. జూన్ నెలాఖరులో సినిమా రిలీజ్ కానుంది. ప్రబాస్‌తో పాటూ, దీపికా పదుకొనె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, తదితర ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- రీఫండ్, తేదీ మార్పులకు ఖతార్ ఎయిర్వేస్ అవకాశం..!!
- VerSe Innovation లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పి.ఆర్.రమేష్ నియామకం
- TANA ప్రపంచ సాహిత్యవేదిక 90వ సమావేశం ఘన విజయం
- అమెరికా పర్యటనకు కేటీఆర్
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ సీజ్









